మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ విడుదలైంది.
"చరిత్ర స్మరించుకుంటుంది... ఝాన్సీ లక్ష్మీ భాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని.. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరగయ్యాడు ఒక వీరుడు".. అంటూ సాగే డైలాగ్‌తో ప్రారంభమైంది టీజర్. పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ టీజర్లో విజువల్స్ బాగున్నాయి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.