బాద్షా షారుక్ ఖాన్- విభిన్న చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో 20 ఏళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం 'దేవదాస్'. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేయలేదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో 'ఇజార్' అనే ప్రేమకథా చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.
ఈ కథను నాలుగేళ్ల కిందటే షారుక్‌తో కలిసి చేయాలనుకున్నారట సంజయ్. ప్రేయసి కోసం ఇండియా నుంచి నార్వేకు సైక్లింగ్ చేసిన వ్యక్తి నిజ జీవిత ఆధారంగానే భన్సాలీ ఈ కథను తయారు చేసుకున్నారని సమాచారం. ఇందులో షారుక్ ప్రేమ కోసం నార్వే వరకు సైక్లింగ్ చేసే పాత్రలో కనిపించనున్నారట. దర్శకుడు సంజయ్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట.