తన కార్యాలయాలపై నాలుగు రోజులపాటు విస్తృతంగా జరిగిన ఐటీ సోదాలపై ప్రముఖ నటుడు సోనూసూద్(Sonu Sood Latest News) మౌనం వీడారు. చరిత్రను చెప్పుకోవాల్సిన అవసరం లేదని.. కాలమే చెబుతుందని ట్వీట్ చేశారు. తాను దేశప్రజలకు సేవచేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నానని తెలిపారు.
"దేశ ప్రజలకు సేవ చేసేందుకు ప్రతిజ్ఞ చేశాను. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి.. ప్రజల ప్రాణాలను రక్షించటం కోసం, పేదల కోసం ఎదురుచూస్తుంది. మానవతప్పిదాలకూ నష్టపోయిన వారికి అండగా ఉండాలని నేను అనేక మందిని ప్రోత్సాహించాను. కొంతమంది అతిథులు రావటం వల్ల నాలుగు రోజులుగా మీకు సేవ చేయలేకపోయాను. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గానూ.. వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం ఉపయోగించమని.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్ సంస్థలకు సూచించాను. మళ్లీ వినయంగా మీకు సేవ చేసేందుకు, జీవితాలను కాపాడేందుకు వచ్చాను. నా ప్రయాణం కొనసాగుతుంది. కష్టమైన దారుల్లోనూ సులభ ప్రయాణాన్ని కనుక్కోవచ్చు."
-- సోనూసూద్, ప్రముఖ నటుడు
నాలుగు రోజుల పాటు..
పన్ను ఎగవేత దర్యాప్తులో(Sonu Sood Income Tax) భాగంగా.. సోనూసూద్(Sonu Sood News) నివాసాలు, కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ముంబయి, లఖ్‌నవూలోని సోనూసూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సోనూ.. రూ.20 కోట్లకుపైగా పన్ను ఎగవేశారని ఐటీ శాఖ వెల్లడించింది. కొవిడ్ మొదటి వేవ్ సమయంలో ఆయన సంస్థకు రూ.18 కోట్లకు పైగా విరాళాలు రాగా.. కేవలం రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేశారని అధికారులు పేర్కొన్నారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా..