తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వలస కూలీలను హెచ్చరించిన సోనూసూద్

తన పేరు చెప్పి కొందరు వ్యక్తులు మోసం చేయాలని చూస్తున్నారని, నటుడు సోనూసూద్ వలసకూలీలను హెచ్చరించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వలస కూలీలను హెచ్చరించిన సోనూసూద్
నటుడు సోనూసూద్

By

Published : Jun 5, 2020, 6:24 PM IST

పలుచోట్ల చిక్కుకుపోయిన వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు నటుడు సోనూసూద్. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు తన పేరు చెప్పి, డబ్బులు వసూలు చేస్తున్నారని కూలీలను హెచ్చరించారు సోనూ. ఇలాంటి సంఘటనలు ఏమైనా దృష్టికి వస్తే, తనకు తెలియాజేయాలని ట్విట్టర్​ వేదికగా విజ్ఞప్తి చేశారు. నకిలీలకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్​షాట్స్​ను పంచుకున్నారు.​

"మేం వలస కూలీలకు ఉచితంగానే సేవ చేస్తున్నాం. ఈ విషయంలో ఎవరైనా మీకు డబ్బులు అడిగితే, వెంటనే తిరస్కరించండి. ఆ తర్వాత మాకు లేదంటే సమీప పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయండి" -సోనూసూద్, నటుడు

ఇటీవలే నిసర్గ తుపాన్​ వచ్చిన సమయంలోనూ సోనూసూద్ బృందం.. ముంబయి తీరప్రాంతంలోని పలు స్కూళ్లు, కాలేజ్​లు, తదితర ప్రాంతాల్లో 28 వేలకుపైగా ఆహార పొట్లాలు పంచిపెట్టారు.

ఇప్పటికే వలసకూలీల విషయంలో సోనూ చేస్తున్న సేవలను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, రాజ్యసభ ఎంపీ అమర్ పట్నాయక్ తదితరులు మెచ్చుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details