బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అభిమాని తయారు చేసిన 'లీఫ్ ఆర్ట్'పై హర్షం వ్యక్తం చేశారు. ఆకుపై సోనూసూద్ బొమ్మను గీసిన ఆ అభిమాని తన ట్విట్టర్ ఖాతాలో సంబంధిత చిత్రాన్ని పోస్ట్ చేశాడు. 'రియల్ సూపర్ హీరో సోనూసూద్‌కు ఇది నచ్చుతుందని భావిస్తున్నా' అని క్యాప్షన్ పెట్టాడు.
అభిమాని 'లీఫ్ ఆర్ట్'కు సోనూ సర్ప్రైజ్ - ఫ్యాన్ మేడ్ లీఫ్ ఆర్ట్
బాలీవుడ్ నటుడు, ప్రముఖ విలన్ సోనూసూద్‌కు సర్ప్రెజ్ గిఫ్ట్ ఇచ్చాడు ఓ అభిమాని. లీఫ్ ఆర్ట్ వేసి ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ పోస్టును సోనూసూద్ రీట్వీట్ చేయడం విశేషం.
సోనూసూద్‌కు ఓ అభిమాని సర్ప్రైజ్ గిఫ్ట్
ఈ ఫొటోను సోనూసూద్ రీట్వీట్ చేశారు. ఆ అభిమానిని కొనియాడారు. ఈ ఫొటోను సోనూసూద్ షేర్ చేసిన కొన్ని నిమిషాలకే వేల మంది లైక్ కొట్టడం విశేషం.
ఇదీ చదవండి:అబ్బో.. ఆ సినిమాలో ఎన్నెన్ని ముద్దులో!