లాక్డౌన్లో ఎంతో మంది పేదలకు, నిరాశ్రయులకు అండగా నిలిచి, వారి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్. ఈ క్రమంలోనే ఆయన బయోపిక్ తీయాలని పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం తనను కూడా సంప్రదించారని సోనూ తెలిపారు. త్వరలోనే తన జీవితాధారంగా సినిమా వస్తుందని చెప్పారు. అయితే ఈ విషయమూ కచ్చితంగా చెప్పలేనని అన్నారు. ఎవరైనా తీస్తే అందులో హీరో పాత్ర తానే చేస్తానని స్పష్టం చేశారు. తన జీవితంలోని ఎత్తుపల్లాలు, ఎదురైన అనుభవాలు తనకంటే బాగా ఇతరులకు తెలియవని సోనూ అన్నారు.
సోనూసూద్ బయోపిక్ త్వరలో.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
తనపై బయోపిక్ తీస్తే అందులో తానే నటిస్తానని స్పష్టం చేశారు ప్రముఖ నటుడు సోనూ సూద్. తనకన్న ఇంకెవరూ ఆ పాత్రను బాగా చేయలేరని ఆయన చెప్పారు.
సోనూ సూద్
లాక్డౌన్లో వలస కార్మికులతో తనకు ఏర్పడిన అనుభవాలను శాశ్వతంగా పొందుపర్చేలా ఓ పుస్తకం రాస్తున్నట్లు సోనూ ఇప్పటికే తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి గోపీచంద్-అనుష్క ముచ్చటగా మూడోసారి?