కొవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూనే ఉన్నారు సోనూసూద్(sonu sood). సెకండ్ వేవ్‌లో ఆయన సేవలు మరింత విస్తృతమయ్యాయి. ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పి, దేశమంతటా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితంగా అందిస్తూ ప్రాణదాత అనిపించుకుంటున్నారు. తాజాగా మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు సోనూసూద్. కరోనా మృతదేహాలను ఉంచేందుకు ఫ్రీజర్లను (dead body freezer) సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
sonu sood : సోనూసూద్ మరో సాయం - కరోనా మృతదేహాలకు ఫ్రీజర్లు సోనూసూద్
నటుడు సోనూసూద్ (sonu sood) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కరోనా మృతిదేహాల కోసం ఫ్రీజర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి సోనూసూద్‌కు ఫ్రీజర్లు సాయం చేయాలన్న వినతులు వచ్చాయి. సనికిరెడ్డిపల్లి, ఔషాపూర్, బొంకూర్, ఓర్వకల్, మద్దికెరా గ్రామాలకు చెందిన పలువురు సోనూకు ఈ విషయాన్ని విన్నవించుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫ్రీజర్లు దొరకడం కష్టంగా మారిందని.. అందువల్ల మృతదేహాలను ఊళ్లకు తీసుకురావడం కోసం చాలా తంటాలు పడాల్సి వస్తోందని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన సోనూ.. వారికి సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఫ్రీజర్లను అవసరమైన ప్రాంతాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు.