తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రూ.1000తో వేల మంది దాహం తీర్చండి' - water

నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వెయ్యి రూపాయలను దానం చేయమని అభిమానులకు ట్వీట్ చేసింది సోనాక్షిసిన్హా. ఈ డబ్బుతో 5 లక్షల లీటర్ల నీటిని అందించవచ్చని ట్వీటింది.

సోనాక్షి

By

Published : Apr 21, 2019, 12:43 PM IST

సినిమాల్లో పాటలు, ఫైట్లతోనే కాదు సామాజిక సేవలోనూ ముందుంటారు కొంత మంది సినీ ప్రముఖులు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చేరింది. మహరాష్ట్రలో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు తాగునీరు అందించే సదుద్దేశంతో వెయ్యి రూపాయలు దానం చేయమని ట్వీట్ చేసింది.

"మీకు తెలుసా మీరిచ్చే వెయ్యి రూపాయలతో 5 లక్షల లీటర్ల నీటిని అందించవచ్చని. ఈ డబ్బుతో మహారాష్ట్రలో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల సాయంతో తాగు నీరు అందింవచ్చు. మీరిచ్చే ఈ దానం ఎంతో మంది దాహార్తిని, అవసరాన్ని తీరుస్తుంది. jalmitra.org వెబ్​సైట్ ద్వారా డొనేట్ చేయండి" -సోనాక్షి సిన్హా ట్వీట్

ప్రస్తుతం మహారాష్ట్రలో నీటి ట్యాంకర్ ధర 2వేలు రూపాయలు. విరాళం ద్వారా 10లక్షల లీటర్ల నీరు అందించవచ్చు. ఈ అంశంపై స్పందించిన సోనాక్షి.. వెయ్యి రూపాయలను దానం చేయమని అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఈ డబ్బుతో 5 లక్షల లీటర్ల నీరు అందించవచ్చని ట్వీటింది.

వేసవిలో మహారాష్ట్ర గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే ఓ ఏడాది ఐపీఎల్ మ్యాచ్​లు నిర్వహించడానికి నీరు వృథా అవుతుందని పొరుగు రాష్ట్రానికి వేదికను మార్చారు. 2016లో ముంబయి ఇండియన్స్​ మ్యాచ్​లు విశాఖలో జరిపారు.

ABOUT THE AUTHOR

...view details