తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సెక్స్​ పట్ల సమాజ దృక్పథం మార్చే పనిలో సోనాక్షి

"శృంగారాన్ని నాలుగక్షరాల పదంగా భావించే వరకు సిగ్గుపడుతూనే ఉంటాం" అనే ఆలోచనే ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం 'కాందానీ షఫా​ఖానా'. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించింది. సమాజానికి సెక్స్ పై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ సినిమా అని చెప్పింది చిత్ర బృందం.

సోనాక్షి సిన్హా

By

Published : Jul 17, 2019, 6:49 PM IST

"సమాజంలో సెక్స్ ఒక భాగమే. ఈ విషయంపై మాట్లాడటం తప్పుకాదు" అంటూ సందేశాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'కాందానీ షఫాఖానా'. సోనాక్షి సిన్హా హీరోయిన్​. శిల్పి దాస్​... డైరెక్టర్.

పంజాబ్​లోని ఒక చిన్న పట్టణంలో ఓ అమ్మాయి సెక్స్​ క్లినిక్​ ఎందుకు నడపాల్సి వచ్చింది, ఆ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అనే వినూత్న కథాంశంతో ఈ సినిమా తీశారు.

'భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సెక్స్ ఎడ్యుకేషన్​ను నిషేధించారు. ఈ సమస్యపై మనమందరం పోరాడాలి.' - శిల్పి దాస్‌గుప్తా ,దర్శకుడు

'నేను ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నా. లైంగిక అవగాహన అనేది అందరూ చర్చించాల్సిన అంశం. ఆ విషయంపై మాట్లాడే ధైర్యం సమాజానికి ఈ చిత్రం ఇస్తుందని భావిస్తున్నా. ప్రజలను ఆలోచించేలా చేస్తుందని కచ్చితంగా నమ్ముతున్నా'. -సోనాక్షి సిన్హా, హీరోయిన్

"సోనాక్షి సిన్హా ధైర్యంగా ఈ సవాలు స్వీకరించింది. శృంగారాన్ని చెడ్డ విషయంగా చూడకుండా ఉండటానికి సమాజానికి సహాయం చేయగలమని మేము భావిస్తున్నాం" -శిల్పి దాస్ గుప్తా, దర్శకుడు

ఇది చదవండి: 'అమ్మాయిల చుట్టూ ఇక తిరగను...

ABOUT THE AUTHOR

...view details