‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా ఓ స్పెషల్ కార్డ్‌ను సితార, ఆద్యా తయారు చేసి మహేశ్‌కు బహుమతిగా అందించారు. గిఫ్ట్ చూసిన మహేశ్ చాలా సంతోషించి.. 'ఈ కార్డ్‌ను నేను ఫ్రేమ్ కట్టించి, స్టడీ రూమ్‌లో పెట్టుకుంటాను' అని అన్నాడు.
సితార: ఆర్మీ అధికారి పాత్రలో నటించడం ఎలా ఉంది?
మహేశ్: ఆర్మీ అధికారి పాత్రలో నటించడం చాలా గర్వంగా ఉంది. ఆర్మీ వాళ్లు లేకపోతే మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉండేవాళ్లం కాదు.
ఆద్యా: ఆ పాత్రను పోషించడం ఛాలెంజ్‌గా అనిపించిందా?
మహేశ్: మేజర్ అజయ్ కృష్ణ పాత్రను పోషించడం ఛాలెంజ్‌గా అనిపించలేదు. ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో చిత్రీకరించాం. ఆ సమయంలో కొంతమంది ఆర్మీ వాళ్లతో మాట్లాడాను. ఈ షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మహేశ్: కశ్మీర్ షూటింగ్‌కు నువ్వు కూడా వచ్చావ్ కదా. అక్కడ మనం సితార పుట్టినరోజును సెలబ్రేట్ చేశాం. మరి నీ అనుభవం ఎలా ఉంది?
ఆద్యా: చాలా అద్భుతంగా ఉంది
సితార:బాంబ్ పేలగానే జాతీయ పతాకం రంగులు రావడం.. ఎలా అనిపించింది?
మహేశ్:ఆ ఆలోచన మా దర్శకుడిది. మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చేశాం. (మధ్యలో సితార అందుకుని అది చూసి అందరూ వావ్ అన్నారు. వెంటనే మహేశ్.. నన్ను కొంచెం మాట్లాడని.. (నవ్వులు))
సితార: ఈ సినిమా మొత్తంలో ట్రైన్ సీక్వెన్స్ చాలా ఫన్నీగా ఉంటుంది. మరి షూటింగ్ సమయంలో ఎలా అనిపించింది?
మహేశ్:ఆ ట్రైన్ ఎపిసోడ్ షూటింగ్ చాలా ఫన్నీగా సాగింది. ట్రైన్ సీక్వెన్స్‌లోని ప్రతి సీన్ షూట్ అవ్వగానే మేమందరం బాగా నవ్వుకునే వాళ్లం. అది చాలా గ్రేట్ టైమ్.
ఆద్యా:ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేశారా..?
మహేశ్: ఆ.. చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడు ట్రైన్ జర్నీ చేశాను. మా డైరెక్టర్ అనిల్‌రావిపూడికి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు ఫ్లైట్స్ అంటే ఇష్టముండదు.
ఆద్యా: ఈ సినిమాలో మీకు నచ్చిన పంచ్ డైలాగ్..?
మహేశ్: 'మీరందరూ నేను కాపాడుకునే ప్రాణాలు' ఆ డైలాగ్ అంటే నాకు బాగా ఇష్టం
మహేశ్: మరి నీ ఫేవరెట్ డైలాగ్ ఏది?
ఆద్యా: మియావ్ మియావ్ పిల్లి.. మిల్క్ బాయ్‌తో పెళ్లి (నవ్వులు)