రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ విషయాన్ని మరో రచయిత రామజోగయ్యశాస్త్రి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
'పద్మశ్రీ' అందుకున్న సిరివెన్నెల
టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి... రాష్ట్రపతి చేతుల మీదుగా పద్శశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా పద్శశ్రీ అవార్డు తీసుకుంటున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి
సిరివెన్నెల పేరు చెప్పగానే మనకు ఎన్నో అద్భుతమైన పాటలు గుర్తుకువస్తాయి. వాటిలో ముందు వరుసలో ఉండేవి దర్శకుడు కె.విశ్వనాథ్ తీసిన చిత్రాల్లోని పాటలే. ఇప్పటి సినిమాల్లోనూ తనదైన పాటలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు సిరివెన్నెల. 630 తెలుగు చిత్రాల్లో 2300 పాటలు రాసి రచయితగా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు.