తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జిమ్​కు వెళ్లకుండానే సూపర్​ ఫిట్​ అవ్వండిలా...!

ప్రజలందరికీ ఫిట్​నెస్​పై అవగాహన కల్పించడానికి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఓ యాప్​ను ప్రారంభించనుంది.

శిల్పా

By

Published : May 6, 2019, 2:58 PM IST

ఆరోగ్యకర జీవనం సాగించాలని ఎవరికుండదు చెప్పండి. అందుకోసం ఫిట్​నెస్ చాలా ముఖ్యం. జిమ్​కు వెళ్లి కసరత్తులు చేసే ఓపిక అందరికీ ఉండదు. అలాంటి వారి కోసం మొబైల్​ యాప్​లు చాలానే వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సొంతగా ఓ యాప్​ ప్రారంభించనుంది.

"ఆరోగ్యకర జీవితం గడపడానికి ప్రజలకు సాయం చేద్దామనుకుంటన్నా. వారికి సరైన మార్గదర్శకత్వం కావాలని ఆలోచించా. అందుకే నా అనుభవాలతో పాటు అనుభవజ్ఞుల సలహాలతో ఓ యాప్​ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. జిమ్​కు వెళ్లకుండానే ఇంటి వద్దే మీరు ఫిట్​నెస్ సాధించొచ్చు. ప్రారంభదశలో ఉన్నవారి నుంచి ప్రొఫెషనల్ అథ్లెట్స్ వరకు అందరికీ ఇది ఉపయోగపడుతుంది".
-శిల్పా శెట్టి, బాలీవుడ్ నటి

యాప్​లో ఫిట్​నెస్​తో పాటు యోగా, మెడిటేషన్ ప్రోగ్రామ్స్​ ఉంటాయి. ఆపిల్ యూజర్లకు నేటి నుంచి, ఆండ్రాయిడ్ వినియోగదారులకు జూన్ 8 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details