తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సంజయ్​.. నువ్వు విజేతలా మళ్లీ తిరిగొస్తావు'

బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు కేంద్ర మాజీమంత్రి శత్రుఘ్న సిన్హా. సంజయ్​ త్వరగా కోలువాలని ట్విట్టర్​ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Shatrughan Sinha wishes speedy recovery to Sanjay Dutt
'సంజయ్​.. విజేతలా మళ్లీ తిరిగి వస్తావు'

By

Published : Aug 13, 2020, 4:40 PM IST

వైద్య చికిత్స కోసం తాను కొంత కాలం తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​. ఈ నేపథ్యంలో ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్​ వచ్చిందని వార్తలు వచ్చాయి. త్వరలో మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో సంజయ్​ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంజయ్​ దత్​ త్వరగా కోలుకోవాలని తాజాగా ట్విట్టర్​లో స్పందించారు నటుడు, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా.

"దేశం మొత్తం అభిమానించే నటుడు, పార్లమెంటేరియన్​, సామాజిక కార్యకర్త, నిజమైన గొప్ప దేశభక్తుడైన సునీల్​ దత్​ కుమారుడు సంజయ్​ దత్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మళ్లీ విజేతగా తిరిగి వస్తాడని బలంగా నమ్ముతున్నా. ఆయన కుటుంబంపై దేవుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా".

- శత్రుఘ్న సిన్హా, నటుడు, కేంద్ర మాజీమంత్రి

గతవారం శ్వాస సంబంధిత సమస్య రావడం వల్ల ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరాడు సంజయ్​ దత్​. కరోనా అనుమానంతో పరీక్ష చేయగా అందులో నెగిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఆస్పత్రిలో రెండు రోజుల వైద్య పర్యవేక్షణ తర్వాత సోమవారం డిశ్చార్జ్​ అయ్యాడు​.

సంజయ్​ దత్​ నటించిన 'సడక్​ 2', 'భుజ్: ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా​' ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 'కేజీఎఫ్​ 2', 'షంషేర్​' చిత్రాల్లో నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details