తెలంగాణ

telangana

By

Published : May 25, 2019, 6:13 PM IST

ETV Bharat / sitara

'రణరంగం'లో స్టైలిష్ గ్యాంగ్​స్టర్​​గా శర్వానంద్

స్టైలిష్ గ్యాంగ్​స్టర్​గా కనిపించనున్నాడు హీరో శర్వానంద్. 'రణరంగం' టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్​లుక్ ఆకట్టుకునేలా ఉంది.

'రణరంగం'లో స్టైలిష్ గ్యాంగ్​స్టర్​గా​ శర్వానంద్

టాలీవుడ్ హీరో శర్వానంద్ స్టైలిష్ గ్యాంగ్​స్టర్​గా సందడి చేయనున్నాడు. ఈ కథానాయకుడు నటిస్తోన్న కొత్త సినిమాకు 'రణరంగం' అనే టైటిల్ నిర్ణయించి ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ముద్దుగుమ్మలు కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. 'స్వామిరారా' ఫేం సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు.

రణరంగం సినిమా ఫస్ట్​లుక్

ఈ సినిమాలో యువకుడు​, మధ్య వయస్కుడైన గ్యాంగ్‌స్టర్‌గా శర్వా డ్యుయల్‌ రోల్‌ చేస్తున్నాడని సమాచారం. గుబురు గడ్డంతో, అల్ట్రా స్టైలిష్‌ లుక్​లో ఆకట్టుకుంటున్నాడీ కథానాయకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'నాతో ఎంజాయ్​మెంట్ మామూలుగా ఉండదు' అంటున్న హీరోయిన్ సమంత

ABOUT THE AUTHOR

...view details