బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఫౌంహౌస్‌కే పరిమితమన భాయ్.. ఇటీవల కాలంలో పలు పోస్ట్‌లు పెడుతూ అలరిస్తున్నాడు. తాజాగా పంచుకున్న ఓ వీడియోలో తన పెంపుడు గుర్రానికి ఆకుకూరలు పెడుతూ, తాను వాటిని తిన్నాడు. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుర్రంతో పాటు ఆకులు తిన్న హీరో సల్మాన్‌ఖాన్
ప్రముఖ కథానాయకుడు సల్మాన్‌ఖాన్.. గుర్రంతో పాటు తానూ ఆకుకూరలు తింటూ కనిపించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
హీరో సల్మాన్‌ఖాన్
'పోరాట సమయాల్లో ఆరోగ్యకరమైన అల్పాహారం' అని ఓ నెటిజన్ రాయగా, 'మంచి డిటాక్సినేషన్ ఫుడ్' అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఈరోజు అందమైన వీడియో ఇదేనంటూ కొందరు కామెంట్ చేశారు.