తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'యశోద'గా సమంత.. ఈసారి అలాంటి కథతో సాహసం

Samantha new movie: సమంత పాన్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దీనిని థ్రిల్లర్​ జానర్​ కథతో తెరకెక్కిస్తున్నారు. మార్చి కల్లా చిత్రీకరణ పూర్తి చేస్తామని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.

samantha
సమంత

By

Published : Dec 6, 2021, 4:47 PM IST

Samantha yasodha: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి 'యశోద' టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు.

'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకులు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత సత్తా ఏంటనేది అందరికీ తెలిసింది.

సమంత యశోద మూవీ

"సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్నాం. మార్చితో షూటింగ్ పూర్తవుతుంది" అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.

సమంతతో పాటు సినిమాలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తుండగా హరి - హరీశ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details