తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ డైరెక్టర్​కు ఫోన్​ చేసి ఏడ్చిన సమంత! - దూకుడు షూటింగ్​లో సమంత

సమంత ఓ సమయంలో తనకు ఫోన్ చేసి ఏడ్చిందని తెలిపారు శ్రీను వైట్ల. ఆయన తెరకెక్కించిన 'దూకుడు'(Dookudu Movie Director) చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీను వైట్ల ఈ విషయాన్ని వెల్లడించారు.

samantha
సమంత

By

Published : Sep 25, 2021, 4:19 PM IST

Updated : Sep 25, 2021, 8:09 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, సమంత(Samantha in Dookudu) జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'దూకుడు'. శ్రీనువైట్ల(Dookudu movie Director) దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో పదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలోనే దర్శకుడు శ్రీనువైట్ల(sreenu vaitla movies list) తాజాగా పలు ఛానల్స్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. 'దూకుడు' సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఎన్నో విశేషాలను ఆయన వెల్లడించారు. సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఇస్తాంబుల్‌లో ప్రారంభించామని.. సామ్‌-మహేశ్‌లపై(Mahesh Babu Samantha Movie) కొన్ని లవ్‌ సీక్వెన్స్‌లు షూట్‌ చేశామని చెప్పారు.

శ్రీను వైట్ల

'ఇస్తాంబుల్‌ వెళ్లడానికి ఓరోజు ముందు మహేశ్‌బాబుకు మా ఫామ్‌హౌస్‌లో స్పెషల్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చాను. సినిమాకు సంబంధించిన కొన్ని సీక్వెన్స్‌ల గురించి చర్చించుకున్నాం. కొన్ని పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు కూడా చెప్పాను. దాంతో నా వర్క్‌కి మహేశ్‌ ఫిదా అయిపోయి అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. వెంటనే నమ్రతకు ఫోన్‌ చేసి.. 'శంకర్‌ తెరకెక్కిస్తోన్న 'స్నేహితుడు'లో నేను యాక్ట్‌ చేయనని చెప్పు' అని అన్నారు. ఆ మాటకు అటు నమ్రత, ఇటు నేను ఇద్దరం షాక్‌ అయ్యాం. 'దూకుడు', 'స్నేహితుడు' ప్రాజెక్ట్‌లకు డేట్స్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల మహేశ్‌ నా ప్రాజెక్ట్‌ ఓకే చేసి శంకర్‌కు నో చెప్పారు. ఆ క్షణం నుంచి నాకు ఈ ప్రాజెక్ట్‌ మరింత బాధ్యత పెరిగింది' అని శ్రీను వైట్ల చెప్పారు.

అనంతరం ఇస్తాంబుల్‌ షూటింగ్‌ గురించి మాట్లాడుతూ..'ఇస్తాంబుల్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ షూట్‌ ఎంతో సరదాగా జరిగింది. ఆ సినిమా షూట్‌ను మేము బాగా ఎంజాయ్‌ చేశాం. ఓరోజు షూటింగ్‌ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో సమంత షాపింగ్‌కు వెళ్తానని అడగ్గా.. సరే అన్నాను. బయలుదేరిన పది నిమిషాలకే ఆమె నాకు ఫోన్‌ చేసి బాగా ఏడ్చేసింది. 'ఏమైంది సమంత?' అని అడగ్గా.. 'ఆత్మాహుతి దాడిని కళ్లారా చూసినట్లు చెప్పింది'. అక్కడ అవన్నీ సాధారణమైన విషయాలని నచ్చజెప్పాం. కానీ సామ్‌ మాత్రం కొన్నిరోజులపాటు అదే షాక్‌లో ఉంది' అని శ్రీను వైట్ల వివరించారు.

Last Updated : Sep 25, 2021, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details