'సామజవరగమన.. నిను చూసి ఆగగలనా'.. ప్రస్తుతం సంగీత ప్రియుల్ని ఎక్కువగా అలరిస్తున్న పాట. 'అల వైకుంఠపురములో' సినిమాలోని ఈ గీతం.. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటి నుంచి ఒక్కొక్క రికార్డు సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు మరో ఘనత అందుకుంది. అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా నిలిచింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం.
'సామజవరగమన' పాటతో బన్నీ మరో రికార్డు
యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకున్న తొలి తెలుగు పాటగా 'సామజవరగమన' రికార్డు సృష్టించింది. ఇప్పటికే 1 మిలియన్ లైక్‌లు అందుకున్న గీతంగానూ నిలిచింది.
అల్లు అర్జున్
ఈ సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లు. సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, టబు, రాజేంద్ర ప్రసాద్, జయరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: అందుకే మేకప్ వద్దనుకున్నా: సాయి పల్లవి