అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. ఈ చిత్రంలో విశేష ఆదరణ దక్కించుకున్న 'సామజవరగమన' పాట పూర్తి వీడియో వచ్చేసింది. యూట్యూబ్లో అత్యధిక మంది లైక్ చేసిన తొలి తెలుగు పాటగా నిలిచిందీ సాంగ్. తమన్ సంగీతం, సిద్ శ్రీరామ్ స్వరం, సీతారామశాస్త్రి లిరిక్స్ ఈ గీతానికి ప్రధాన బలమయ్యాయి. ఈ పాట హిట్టవడం వల్ల ఫీమేల్ కవర్ రూపంలో గాయని శ్రేయా ఘోషల్తోనూ పాడించి విడుదల చేసింది చిత్రబృందం.
'సామజవరగమన' పూర్తి వీడియో వచ్చేసిందోచ్ - అల వైకుంఠపురములో పాటలు
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఇందులోని అన్ని పాటలకు విశేష ఆదరణ దక్కింది. ముఖ్యంగా 'సామజవరగమన' పాట అయితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరి నోట్లో నానింది. తాజాగా ఈ పాట పూర్తి వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
'సామజవరగమన' పూర్తి వీడియో వచ్చేసిందోచ్..!
'అల వైకుంఠపురములో' చిత్రంలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలు. సీనియర్ నటి టబు ఈ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. సుశాంత్, జయరామ్, మురళీశర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలు.
ఇదీ చదవండి:నితిన్.. నిఖిల్ల పెళ్లి ఒకే రోజు..!
Last Updated : Mar 1, 2020, 1:03 PM IST