తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​ఖాన్​కు న్యాయస్థానం హెచ్చరిక

బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​కు జోధ్​పుర్​ సెషన్స్​ కోర్టు హెచ్చరించింది. 20 ఏళ్ల క్రితం నాటి కృష్ణ జింకల వేట కేసులో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడీ కండల వీరుడు. గురువారం కోర్టులో విచారణకు హాజరుకాకపోవడం వల్ల ఆగ్రహించింది న్యాయస్థానం.

సల్మాన్​ఖాన్​కు న్యాయస్థానం హెచ్చరిక

By

Published : Jul 5, 2019, 9:41 AM IST

బాలీవుడ్​ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పుర్‌ సెషన్స్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో కృష్ణ జింకల వేట కేసులో ఐదేళ్లు జైలు శిక్ష వేసిన న్యాయస్థానం... పూచీకత్తుపై బెయిల్​ ఇచ్చింది. గురువారం ఈ కేసు విచారణకు సల్మాన్‌ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. అయితే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ స్టార్​ హీరోపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం.

కేసు ఇదీ...

1998 అక్టోబరులో జోధ్‌పుర్‌ సమీపంలోని కంకణి గ్రామం భగోదాకీ ధనిలో రెండు కృష్ణ జింకలు హత్యకు గురైనట్లు కేసు నమోదైంది. 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' సినిమా చిత్రీకరణ సందర్భంగా అక్కడకు వచ్చిన సల్మాన్‌ ఖాన్.. సహ నటులు సైఫ్‌ అలీఖాన్‌, టబు, సోనాలీ బింద్రే, నీలంతో కలిసి వాహనంలో వెళుతూ జింకలపై కాల్పులు జరిపినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఇదే కేసులో సల్మాన్‌ 1998, 2006, 2007లో మొత్తం 18 రోజులు జోధ్‌పుర్‌ జైల్లో గడిపాడు. గతేడాది సల్మాన్‌కు ఈ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది.

రెండు రోజులు జైలులో ఉన్న తర్వాత జోధ్‌పుర్‌ సెషన్స్‌ కోర్టు సల్మాన్‌కు 50 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా సల్మాన్ దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సెషన్స్‌ కోర్టులో ఈ కేసు విచారణకు సల్మాన్‌ హాజరుకాకపోవడం వల్ల బెయిల్‌ రద్దు చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details