RRR: ప్రపంచవ్యాప్తంగా 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా సందడి మొదలైంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపారని, రాజమౌళి టేకింగ్ అద్భుతమని సగటు ప్రేక్షకుడితోపాటు ప్రముఖులూ నెట్టింట కొనియాడుతున్నారు. ఈ ఆనందోత్సాహంలో రామ్‌చరణ్‌కు శిక్షణ ఇచ్చిన ప్రముఖ బాక్సర్ నీరజ్ గోయత్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. 'తన ఆధ్వర్యంలో చరణ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిన దృశ్యమది. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో బాక్సింగ్‌కు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ సోదరుడు రామ్‌చరణ్ ఎంతో కష్టపడి బాక్సింగ్ నేర్చుకున్నారు. ప్రాణం పెట్టి నటించారు' అని నీరజ్ పేర్కొన్నారు.
'ఆర్‌ఆర్‌ఆర్' కోసం తీవ్రంగా శ్రమించిన చరణ్.. వీడియో వైరల్!
RRR: రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన 'రౌద్రం రణం రుధిరం' శుక్రవారం విడుదలై.. సందడి చేస్తోంది. చరణ్, తారక్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రముఖులు పశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌కు బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన నీరజ్ గోయత్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..
ramcharan
హరియాణాకు చెందిన నీరజ్ 2017లో 'ఆనరరీ బాక్సర్ ఆఫ్ ది ఇయర్', 2018లో 'మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులు అందుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్'లోని తన పాత్ర కోసం చరణ్ ఎంత కష్టపడ్డారో మీరూ చూడండి..
ఇదీ చదవండి:''ఆర్‌ఆర్‌ఆర్' ఓ మాస్టర్ పీస్.. భారతదేశ అగ్నిపర్వతం'- సెలబ్రిటీల రివ్యూలు