బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది ధ్రువీకరించారు. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడటం వల్ల నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని మూడు రోజుల పాటు విచారించిన అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. అనంతరం రియాకు వైద్య పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేయించారు. ఆమెకు కొవిడ్ నెగటివ్ రావడం వల్ల ఎన్‌సీబీ అధికారులు రియాను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం డ్రగ్స్ ప్రొక్యూర్‌మెంట్ కేసులో రియాకు సెప్టెంబర్ 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అలాగే ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
సుశాంత్ కేసు: రియా చక్రవర్తికి 14 రోజుల రిమాండ్
డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధం ఉందనే కారణంతో ఈరోజు నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. తాజగా రియాను కోర్టు ముందు హాజరుపర్చగా.. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం.
సోమవారమే రియాను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగ్గా.. అదేమీ జరగలేదు. ఆమె విచారణకు సహకరిస్తున్నారని పేర్కొన్న ఎన్‌సీబీ అధికారులు.. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీచేశారు. మూడో రోజు విచారణలో భాగంగా తాను గంజాయి మాత్రమే కాకుండా ఇతర కెమికల్స్ వాడినట్లు రియా చెప్పారని సమాచారం.
సుశాంత్ మరణంపై నమోదైన కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు 28 ఏళ్ల రియాను విచారించిన సందర్భంలో ఆమె వాట్సాప్ చాట్‌ను పరిశీలించారు. అందులో డ్రగ్స్‌కు సంబంధించిన సంభాషణ ఉండటం వల్ల ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.