తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ కేసులో నన్ను తప్పుగా ఇరికించారు' - rhea chakraborty sushant allegations

సుశాంత్ కేసులో అతని​ తండ్రి తనను తప్పుగా ఇరికించారని రియా చక్రవర్తి సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే దర్యాప్తును ముంబయి పోలీస్ స్టేషన్​కు బదిలీ చేయాలని కోరింది.

Rhea Chakraborty
రియా చక్రవర్తి

By

Published : Jul 31, 2020, 10:34 AM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ మృతి కేసులో రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. ఇటీవలే సుశాంత్​ ఆత్మహత్యకు పాల్పడటానికి రియా చక్రవర్తి కారణమంటూ అతని తండ్రి బిహార్​లోని పట్నా పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ ప్రారంభించగా.. సుశాంత్ ప్రేయసి రియా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజ్​పుత్ తండ్రి తనను తప్పుగా కేసులో ఇరికించారని తెలిపింది.

సుశాంత్​ మరణంతో కుంగిపోయిన తనను కొంతమంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు ధర్మాసనానికి వివరించింది. సుశాంత్​ తండ్రి బిహార్​లో తన పలుకుబడి ఉపయోగించి కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున.. ముంబయికి కేను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

సుశాంత్​తో తనకున్న బంధాన్ని వివరిస్తూ.. జూన్​ 8 వరకు తామిద్దరం సహజీవనం చేశామని తెలిపింది. ఆ సమయంలో సుశాంత్​ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని.. వాటిని అధిగమించేందుకు మందులు కూడా వాడేవాడని చెప్పుకొచ్చింది. సుశాంత్​ మృతితో తాను తీవ్ర బాధను అనుభవిస్తున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details