కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న మాస్ మహారాజా రవితేజ.. ఇప్పుడు 'డిస్కోరాజా'తో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జనవరి 24న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాస్‌రాజాకు సంబంధించి ఓ స్టైలిష్ ఫొటో బయటకొచ్చింది.
అదిరిపోయే లుక్‌తో మాస్ మహారాజా - బాడీ బిల్డర్‌గా రవితేజ
మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం 'డిస్కోరాజా'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా రవితేజకు సంబంధించిన ఓ స్టైలిష్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Raviteja
ఈ ఫొటోలో రవితేజ షార్ట్.. నలుపు రంగు బనియన్ ధరించి డంబెల్‌తో కసరత్తులు చేస్తూ స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. ఇక చక్కటి ఆకృతిలో ఉన్న అతడి షోల్డర్ మజిల్స్ చూస్తుంటే ఈతరం కుర్ర హీరోలు కూడా రవితేజ ఫిట్‌నెస్‌తో పోటీ పడలేరేమో అని అనిపించక మానదు. ఏదేమైనా ఐదు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఇలా అదిరిపోయే ఫిన్‌నెస్‌ను చూపించడమంటే మామూలు మాటలు కాదు.
ఇవీ చూడండి.. 'సామజవరగమన'కు టీచర్ పేరడి.. నెట్టింట వైరల్