మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాకు 'ఖిలాడి' టైటిల్ పెట్టారు. ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో స్టైలిష్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు రవితేజ. ఇతడి సరసర మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించనున్నారు. నేడు హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలుకానుందీ చిత్రం.
ఇద్దరు ముద్దుగుమ్మలతో 'ఖిలాడి' రవితేజ - ravi teja news
'క్రాక్'లో నటిస్తున్న హీరో రవితేజ కొత్త సినిమాకు 'ఖిలాడి' పేరు పెట్టారు. ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
రవితేజ కొత్త సినిమా
రవితేజతో ఇంతకు ముందు 'వీర' తీసిన రమేశ్ వర్మ.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవి ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యనారాయణ కొనేరు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే 'క్రాక్'లో నటిస్తూ బిజీగా ఉన్నారు రవితేజ. శ్రుతిహాసన్ హీరోయిన్, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.
Last Updated : Oct 18, 2020, 11:44 AM IST