Rashmika remuneration: 'పుష్ప'.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. మొన్నటివరకు థియేటర్లకు వెళ్లి సినిమా చూసిన ఆడియెన్స్.. ఇప్పుడు ఓటీటీలోనే రిపీట్‌గా చూస్తున్నారు. మూవీ టీమ్ కూడా ఈ విషయంలో ఫుల్‌హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.
'పుష్ప'లో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపం చూపిస్తే, పల్లెటూరి అమ్మాయిగా రష్మిక ఆకట్టుకునేలా కనిపించింది. అయితే రెండో పార్ట్ కోసం రష్మిక రెమ్యునరేషన్ పెంచేసిందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
'పుష్ప' కోసం రష్మిక రూ.2 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండో భాగం కోసం 50 శాతం పెంచేసింది! అంటే మొత్తం రూ.3 కోట్లు డిమాండ్ చేసిందట. దానికి నిర్మాతలు కూడా ఒప్పుకొన్నారట.