NTR Rashmika movie: హీరోయిన్ రష్మిక.. వరుసగా స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళ్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ఆలియాభట్, జాన్వీకపూర్, కియారా అద్వానీ.. వీరిలో ఎవరినైనా తీసుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మికకు ఆ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. నాయికగా ఆమెను ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. రాజకీయ నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం. తారక్ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తారట!
రష్మికకు మరో క్రేజీ ఆఫర్.. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్! - Rashmika ntr movie
NTR Rashmika movie: ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్గా రష్మికను తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తుందట! ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
రష్మిక
కాగా, ఇటీవల 'పుష్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రష్మిక. ప్రస్తుతం 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'మిషన్ మజ్ను', 'గుడ్‌బై', 'పుష్ప 2'లో నటిస్తోంది.
ఇదీ చూడండి: Jai Bhim at Oscars: 'జై భీమ్'కు మరో అరుదైన గౌరవం