తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూర్య సినిమా కోసం దర్శక ధీరుడు - కాప్పాన్

తమిళ హీరో సూర్య,మలయాళ సూపర్​ స్టార్ మోహన్ లాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'కాప్పాన్'. ఈ సినిమా తెలుగు టైటిల్​ను టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఈ నెల 27న ప్రకటించనున్నాడు.

సూర్య

By

Published : Jun 25, 2019, 9:14 PM IST

తమిళంతో పాటు తెలుగులో కూడా హీరోగా తనకంటూ గుర్తింపుతో పాటు అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు సూర్య. ప్రస్తుతం కె.వి ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పాన్' అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇది వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీడోక్కడే', 'బ్రదర్స్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించిగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా 'కాప్పాన్' చిత్ర తెలుగు టైటిల్​ను దర్శకధీరుడు రాజమౌళి 27వ తేదీ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రకటించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కె.వి ఆనంద్ తెలిపాడు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఆర్య, సాయేషా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.

ఇవీ చూడండి.. 'స్పైడర్​మ్యాన్' విడుదల తేదీ ఖరారు

ABOUT THE AUTHOR

...view details