హీరోయిన్ రచితారామ్ చేసిన 'ఫస్ట్‌నైట్' కామెంట్స్ రచ్చ రచ్చ అవుతున్నాయి! ఆమె నిషేధించాలంటూ పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన సినిమాలో బోల్డ్ సన్నివేశాల గురించి ఆమె వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగింది?
తాను హీరోయిన్గా నటించిన 'లవ్ యూ రాచు' ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సినిమాలోని పలు సన్నివేశాలను ప్రదర్శించారు. అందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. దీనిపై ఓ జర్నలిస్ట్.. 'సినిమాలో బోల్డ్ సన్నివేశాలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి' అని హీరోయిన్ రచితను అడిగారు.
దీనిపై స్పందించిన ఆమె.. ''ఇక్కడ పెళ్లయిన వారు చాలామంది ఉన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సాధారణంగా పెళ్లి తర్వాత ఏం చేస్తారో చెప్పండి" అని అడిగింది. జర్నలిస్ట్ తిరిగి సమాధానం చెప్పేలోపే.. 'రొమాన్స్ చేస్తారు. నిజమే కదా? ఇందులో అదే చూపించాం' అని తన వ్యాఖ్యలను సమర్ధిస్తూ సమాధానమిచ్చింది.