భారత, తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాతగా అల్లు అరవింద్ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం అతడిని 'ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019' అవార్డుతో సత్కరించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కు అందించారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ చేతుల మీదుగా అల్లు అరవింద్ పురస్కారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో నెటిజన్లు అల్లు అరవింద్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం - Pranab Mukherjee Conferred 'Champions of Change-2019' award to Allu Aravind
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గానూ కేంద్రప్రభుత్వం పురస్కారం అందజేసింది.
చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు అల్లుఅరవింద్‌కు సత్కారం
గీతా ఆర్ట్స్ సంస్థ వరుస సినిమాలతో హిట్లు అందుకుంటోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో..' సినిమా ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.
ఇదీ చూడండి:- 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీపై బాలకృష్ణ కన్ను..!
Last Updated : Feb 17, 2020, 6:32 PM IST