తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాధేశ్యామ్​లోని ఆ పాట కోసం 350మంది డ్యాన్సర్లు - ప్రభాస్ రాధేశ్యామ్

ప్రభాస్​ నూతన చిత్రం 'రాధేశ్యామ్' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల భారీ బృందంతో ఓ పాటను తెరకెక్కించారని సమాచారం.

prabhas's radheshyam unit is picturising a song in hyderabad
ఇటలీ అందాలు... 350 మంది డ్యాన్సర్లు

By

Published : Jan 10, 2021, 7:48 AM IST

రెబల్​ స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. పూజాహెగ్డే కథానాయిక. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌, యు.వి.క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

ఇటలీ అందాల్ని ప్రతిబింబించేలా దిద్దితీర్చిన సెట్‌లో, 350 మంది ఇటాలియన్‌ డ్యాన్సర్లతో ఓ పాటని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి సందర్భంగా ప్రచార చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది చిత్రబృందం.

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో 'రాధేశ్యామ్‌' ఒకటి. యూరప్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేమకథ, యాక్షన్‌ అంశాల మేళవింపుతో రూపొందుతోంది.

ఇదీ చూడండి:త్వరలో ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్​!

ABOUT THE AUTHOR

...view details