నటుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్య పరిస్థితి బాలేదని కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పోసాని ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "నా ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్లు మా స్నేహితులు చెప్పారు. నిజమే నాకు అనారోగ్యమే.. కానీ ప్రాణాపాయ స్థితి కాదు. వైద్యులు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుణ్ని చేశారు. ఇకపై నా ఆరోగ్యం గురించి మీకు ఎలాంటి ఆలోచన వద్దు. త్వరలో షూటింగ్‌కి హాజరవుతాను. తెరపై మీకు కనిపించబోతున్నాను. నేను బావుండాలని పూజించిన వారికి ధన్యవాదాలు" అంటూ తన మనసులో మాట చెప్పాడు.
నా ఆరోగ్యంపై ఆందోళన వద్దు: పోసాని - posani krishna murali
టాలీవుడ్ సహాయ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగా లేదంటూ కొద్ది రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించాడు పోసాని.
పోసాని