ఎస్పీ సాంబమూర్తి ఆశయాలకు అనుగుణంగా వేదనాద ప్రచారాన్ని కొనసాగిస్తామని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి తెలిపారు. నెల్లూరు తిప్పరాజువారి వీధిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంటిని వేద పాఠశాల నిర్వహణకు కంచిపీఠానికి అందజేశారు. మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఎస్పీబీ స్వయంగా కంచి పీఠాధిపతికి గృహాన్ని లాంఛనంగా సమర్పించారు.
వేదపాఠశాల నిర్వహణకు ఇల్లు దానం చేసిన గాయకుడు వేదపాఠశాల నిర్వహణకు ఇల్లు దానం చేసిన ఎస్పీబీ
"భిక్షాటన పూర్వకంగా త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించిన ఘనత ఎస్పీ సాంబమూర్తికే దక్కుతుంది. నెల్లూరు వీధుల్లో భగవన్నామ సంకీర్తనను మారుమోగించిన ప్రతిభాశాలి సాంబమూర్తి. దేశంలో వేదాన్ని, శాస్త్రాన్ని, పురాణాలను, సంగీత, సాహిత్యాలను పరిరక్షించుకునే ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉంది."
- కంచి పీఠాధిపతి
"మా తండ్రి పెద్ద శైవభక్తులు. వారులేరనే అసంతృప్తి తప్ప వారిపేరుతో వేద పాఠశాలను నిర్వహించటం ద్వారా వారు ఇక్కడే ఉన్నారని భావిస్తున్నాం. కంచిపీఠానికి నేను గృహాన్ని అప్పగించలేదని భగవత్‌సేవకు స్వామివారే తీసుకున్నారనేది సత్యం."
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
వేదపాఠశాల నిర్వహణకు ఇల్లు దానం చేసిన గాయకుడు తొలుత స్వామివారికి బాల సుబ్రహ్మణ్యం తులసిమాలను అందజేసి వేదపండితులతో కలిసి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బాలు సోదరీమణులు శైలజ, వసంత, సతీమణి కుమారి కుటుంబసభ్యులు, నగరపాలక సంస్థ కమిషనర్ వీవీఎస్‌ఎన్ మూర్తి, మంత్రి ఓఎస్డీ పెంచలరెడ్డి, త్యాగరాజ స్మరణోత్సవ సభ కార్యదర్శి యనమండ్ర నాగదేవి ప్రసాద్, వీరిశెట్టి హజరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'లూసిఫర్' తెలుగు రీమేక్‌కు దర్శకుడెవరో తెలుసా!