తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అరవింద సమేత' తర్వాత మళ్లీ బన్నీ సినిమా కోసం!

హీరోయిన్ పూజా హెగ్డే.. 'అల వైకుంఠపురములో' సినిమాలోని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

హీరోయిన్ పూజా హెగ్డే

By

Published : Nov 24, 2019, 8:26 AM IST

Updated : Nov 24, 2019, 8:59 AM IST

ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గతేడాది ఎన్టీఆర్​ 'అరవింద సమేత'లో తన పాత్రకు తొలిసారి డబ్బింగ్​ చెప్పుకుని ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రం కోసం మరోసారి సొంత గొంతు అందించింది. ఆ ఫొటోను ఇన్​స్టాలో పంచుకుందీ భామ.

'అల వైకుంఠపురములో' సినిమాలోని తన పాత్రకు పూజా హెగ్డే సొంత డబ్బింగ్

'అల వైకుంఠపురములో'.. ఇటీవలే పారిస్​ షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'సామజవరగమన'.. ఈఫిల్ ట‌వ‌ర్‌కు త‌క్కువేం కాదు: పూజాహెగ్డే

Last Updated : Nov 24, 2019, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details