బాలీవుడ్ స్టార్ నటి సోనాక్షి సిన్హాపై నమోదైన మోసం కేసులో విచారణ ప్రారంభమైంది. దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి ఓ పోలీసు బృందం గురువారం ముంబయిలోని సోనాక్షిసిన్హా ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో దబాంగ్ భామ అందుబాటులో లేదు. శుక్రవారం మరోసారి ఆమెను కలిసే ప్రయత్నం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏమైంది..?
2018లో దిల్లీలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో వేదికపై ప్రదర్శనకు రూ. 24 లక్షలు అడ్వాన్స్ రూపంలో తీసుకున్న సోనాక్షి.... వేడుకకు హాజరుకాలేదని ఆరోపణలు వచ్చాయి. నిర్వాహకులు గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 406ల కింద కేసు నమోదు చేశారు.