నటుడు, యాంకర్ ప్రదీప్‌పై శ్రీరామోజు సునిశిత్ అనే యువ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజులు జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్.. ఓ సినిమాలో నటించడం, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధమన్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రదీప్ సినిమా ఆపాలని ఓ దర్శకుడు ఫిర్యాదు - tollywood news
యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా షూటింగ్ ఆపాలని ఓ దర్శకుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు గల కారణాలను వెల్లడించాడు.
యాంకర్ ప్రదీప్
ప్రస్తుతం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు ప్రదీప్. అయితే ఇతడు గతంలో ఓ విషయం కారణంగా జైలుకు వెళ్లొచ్చాడని, ఇప్పుడు సినిమాలో నటించడం సీబీఎఫ్సీ రూల్స్‌కు వ్యతిరేకమన్నాడు సునిశిత్. ప్రదీప్‌తో పాటు ఆ చిత్ర దర్శకుడు నిబంధనలు అతిక్రమించాడని చెప్పాడు. ఈ చిత్ర షూటింగ్ ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కంప్లైంట్ స్వీకరించారు. న్యాయ సలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు.
Last Updated : Feb 28, 2020, 8:52 PM IST