తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీడైరీ: 20వ శతాబ్దంలో ఒక్కరికే ఆస్కార్!

20 శతాబ్దం మొత్తం మీద ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్న ఏకైక నల్లజాతీయుడు సిడ్నీ పొయేటర్. 91 ఏళ్ల అకాడమీ చరిత్రలో బెస్ట్ యాక్టర్ విభాగంలో పురస్కారం అందుకున్న నల్లజాతీయులు నలుగురు మాత్రమే.

ఆస్కార్

By

Published : Jun 27, 2019, 7:51 AM IST

ఆస్కార్.. ప్రతి నటుడు తమ జీవితంలో ఒక్కసారైన ముద్దాడలనుకునే పురస్కారం. అయితే అకాడమీ అవార్డుల విజేతల ఎంపికలో పారదర్శకత లోపించిందనీ, వర్ణ వివక్ష చూపిస్తున్నారనే విమర్శలు కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఆస్కార్ గెల్చుకున్న వారి జాబితా చూస్తే ఆశ్చర్యకర విషయం తెలుస్తుంది. 20వ శతాబ్దం మొత్తం మీద ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నవారిలో ఒకే ఒక్క నల్లజాతీయుడు ఉన్నాడు.

20 శతాబ్దం అంటే ఆస్కార్ అవార్డులు ప్రారంభమైన 1929 నుంచి 1999 వరకు ఇచ్చిన పురస్కారాల్లో సిడ్నీ పొయిటెర్ ఒక్కడే నల్లజాతీయుడు. లిల్లీస్​​ ఆఫ్ ది ఫీల్డ్ అనే చిత్రానికిగానూ 1963లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ దక్కించుకున్నాడు. మళ్లీ 37 ఏళ్ల తర్వాత 2001లో డేంజల్ వాషింగ్టన్ అకాడమీని ముద్దాడాడు. ట్రైనింగ్ డే సినిమాకు ఈ పురస్కారం అందుకున్నాడు.

91 ఏళ్ల ఆస్కార్ అవార్డుల చరిత్రలో కేవలం నలుగురు నల్లజాతీయులే ఉత్తమ నటుడిగా అకాడమీ పురస్కారం అందుకున్నారు. సిడ్నీ పొయేటర్(1963), డెంజల్ వాషింగ్టన్ (2001), జేమీ ఫాక్స్​ (2004, 'రే' చిత్రం), ఫారెస్ట్ వైటేకర్ (2006, ది లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్) ఈ జాబితాలో ఉన్నారు.

ఇది చదవండి: అసమాన ప్రతిభకు కొలమానం.. విజయనిర్మల ప్రస్థానం

ABOUT THE AUTHOR

...view details