తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''నువ్వే కావాలి'.. గుండెకు హత్తుకుపోయే సినిమా​' - nuvve kavali 20years completed

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో, తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. మంగళవారానికి (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విజయ్​ భాస్కర్​​​ పంచుకున్న ఆసక్తికర సంగతులు మీకోసం..

tarun
తరుణ్​

By

Published : Oct 12, 2020, 4:54 PM IST

Updated : Oct 12, 2020, 5:24 PM IST

విజయ్​ భాస్కర్​

హీరో తరుణ్‌, రిచా జంటగా కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'నువ్వే కావాలి'. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకోబోతోంది. తరుణ్‌-రిచాల నటన, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు విజయ్​ భాస్కర్​ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

"ముందుగా ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఇచ్చిన రామోజీరావు గారు, రవికిశోర్​ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కమర్షియల్​ సినిమా కళ్ల దగ్గరే ఆగిపోతుంది. కానీ ఫీలింగ్ ఉన్న సినిమా​ కళ్ల నుంచి గుండె వరకు వెళ్లి గుర్తుండిపోతుంది. ఈ సినిమా చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో చిత్రీకరించేటప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది. అయితే ఈ సినిమాలో ముందుగా రెండో హీరో పాత్ర సాయికిరణ్​ను ఎంపిక చేశాం. ​ఆ తర్వాత హీరోయిన్​ రిచాను తీసుకున్నాం. చిట్టచివరిగా హీరో తరుణ్​కు అవకాశమిచ్చాం. అతడు ఈ చిత్రంలో నటించలేదు.. జీవించాడు అని చెప్పాలి. అంత గొప్ప సహజ నటన అతనిది. మొత్తంగా ప్రతిఒక్కరూ బాగా నటించారు. ఇక పాటలు, సంగీతం విషయానికొస్తే అత్యద్భుతం. కోటి మ్యూజిక్​తో మ్యాజిక్​ చేశారు. అందరి కృషి వల్లే ఈ సినిమా విజయం సాధించింది. అయితే ఈ చిత్రంలోని 'కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు' పాట కోసం రామోజీరావు నన్ను కలవమన్నారు. అదే మొదటిసారి నేను ఆయన్ను కలవడం. ఈ పాటపై ఆయనకు చిన్న సందేహాలు ఉంటే వాటి గురించి చర్చించుకున్నాం. ఆ తర్వాత నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రోత్సాహించారు." అని తన మనసులో మాటలను పంచుకున్నారు.

Last Updated : Oct 12, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details