కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. సాల్మన్ దర్శకుడు. ఇందులో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా నటిస్తున్నాడు. పూర్తి యాక్షన్ భరిత చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్ లుక్ చాలా కొత్తగా, ఆసక్తిగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఇప్పుడు పోలీసుగా.. తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిగా - అక్కినేని నాగార్జున
అక్కినేని హీరో నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత 'గరుడ వేగ' దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట నాగ్.
నాగ్
తాజాగా మరో క్రేజీ పాత్రలో నటించేందుకు నాగ్ సిద్ధమవుతున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే? 'గరుడ వేగ' చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు నాగ్‌తో ఓ చిత్రం తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడట. ఇప్పటికే నాగ్‌కు కథ చెప్పాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఆదాయపన్ను శాఖ అధికారి పాత్రలో ఈ అక్కినేని హీరో నటించనున్నాడని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.
ఇవీ చూడండి.. దర్శకుడిగా మారనున్న 'పహిల్వాన్'