అటు కరోనా తగ్గుముఖం పడుతోంది.. ఇటు సినిమాల సందడి మొదలవుతోంది. ఇప్పటికే తెలంగాణలో థియేటర్ల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేసి గోల చేయడమే తరువాయి! చాలా కాలంగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అవుతున్న సినీప్రియులు ఎప్పుడెప్పుడు సినిమాలు విడుదలవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే సినిమాలూ విడుదలకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు ఓటీటీల్లోనూ కొన్ని విడుదల కానున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
'ఇష్క్' అంటూనే ప్రేమ కథ కాదంటూ..
'ఇష్క్' అంటారు.. ప్రేమ కథ కాదంటారు.. ఏంటో వీళ్ల వ్యవహారం. అది ఏంటో తెలియాలంటే జూలై 30న విడుదలయ్యే 'ఇష్క్'.. (నాట్ ఎ లవ్ స్టోరీ) చూడాల్సిందే. తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాను ఎస్.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.
సత్యాన్ని గెలిపించేందుకు సత్యదేవ్
ఎంతకైనా తెగించి సత్యాన్ని గెలిపించేందుకు సిద్ధమంటున్నాడు సత్యదేవ్. 'తిమ్మరుసు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ఈ సినిమా థియేటర్‌లో విడుదలకు రెడీ అయ్యింది. జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్ కథానాయిక. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ ఎస్.కోనేరు నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన 'వన్' ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. జులై 30న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది.
- లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కరోనా - షార్ట్‌ఫిల్మ్(ఇంగ్లీష్) - వూట్, జులై 27
- ఛత్రసల్ - వెబ్ సిరీస్(హిందీ) - ఎంఎక్స్ ప్లేయర్, జులై 29
- లైన్స్ - సినిమా(హిందీ) - వూట్, జులై 29
- సిటీ ఆఫ్ డ్రీమ్స్ 2 - వెబ్ సిరీస్(హిందీ) - వూట్, జులై 30
- మిమి - సినిమా(హిందీ) - నెట్‌ఫ్లిక్స్, జులై 30
- సిటీ ఆఫ్ డ్రీమ్స్ - వెబ్‌సిరీస్(ఇంగ్లీష్) - హాట్‌స్టార్, జులై 30
- లిహాఫ్ - షార్ట్‌ఫిల్మ్(హిందీ) - నెట్‌ఫ్లిక్స్, జులై 31