మెగా ఫ్యామిలీ కథానాయకులంతా ఒకే చోట చేరారు. సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు రామ్ చరణ్. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు.
ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు.. ఆనందంలో అభిమానులు - మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్
సంక్రాంతి పండగను మెగా ఫ్యామిలీ సంబరంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ రామ్‌చరణ్ ఓ ఫొటోను నెట్టింట షేర్ చేశాడు. ఇందులో మెగా హీరోలంతా దర్శనమిచ్చారు.

మెగా హీరోలు
ఈ ఫొటోలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌తోపాటు మరో ముగ్గురు యువ హీరోలు దర్శనమిచ్చారు. ఇలా ఒకే ఫ్రేమ్‌లో అందరూ కనిపించడం వల్ల అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. "పండగంతా ఈ ఫొటోలోనే ఉంది. సూపర్ పిక్, వావ్,చాలా బాగుంది" అని కొందరు నెటిజన్లు చెప్పగా.. పవన్ కల్యాణ్ కూడా ఉంటే బాగుండేదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
ఇవీ చూడండి.. ఎవరీ మైఖేల్ జాక్సన్.. కనుక్కొని చెప్పగలరా: హృతిక్