మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకోబోతున్నారు. గురువారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు, చైతన్య కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
నిరాడంబరంగా మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం
నిహారిక- చైతన్య నిశ్చితార్థం గురువారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు ఇరువరి కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు.
నిరాడంబరంగా మెగా డాటర్ నిశ్చితార్థం
ఇటీవలే సోషల్మీడియా ద్వారా తను పెళ్లి చేసుకోబోయే చైతన్య జొన్నలగడ్డను పరిచయం చేసింది నిహారిక. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉండి.. ఇటీవలే వారి కుటుంబాలను ఒప్పించి తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబరులో పెళ్లి తంతు పూర్తి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు సమాచారం.
Last Updated : Aug 14, 2020, 6:35 AM IST