ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ (KGF Movie Director) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సలార్'(Salaar Movie Updates). హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె కాక ప్రత్యేక గీతం కోసం మరో నాయికను రంగంలోకి దింపనున్నారు. ఆ పాత్ర కోసం ఇప్పటికే శ్రీనిధి శెట్టి, శ్రద్ధా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడీ చిత్రం కోసం 'ఖిలాడీ' భామ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు సమాచారం (Salaar Movie Updates) అందుతోంది. ఈ సినిమాలో శ్రుతితో పాటు మరో నాయిక పాత్రకు ప్రాధాన్యముందని, ఇప్పుడా పాత్ర కోసమే మీనాక్షిని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్‌లో ఆమె చిత్ర బృందంతో కలవనున్నట్లు తెలుస్తోంది.
Prabhas Saalar: సలార్‌లో ప్రభాస్‌కు జోడీగా మరో నాయిక? - సలార్ సినిమాలో ప్రభాస్ పక్కన మీనాక్షి చౌదరి
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' చిత్రం(Salaar Movie Updates) రూపొందుతోంది. ఇందులో హీరోయిన్గా శ్రుతిహాసన్ కనిపించనుండగా.. ఓ ప్రత్యేక గీతం కోసం మరో నాయికను (Salaar Heroine Updates) చిత్ర బృందం ఎంపిక చేసింది. 'ఖిలాడీ' భామ మీనాక్షి చౌదరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సలార్
విభిన్నమైన మాస్, యాక్షన్ అడ్వంచరస్ చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. భువన్ గౌడ ఛాయాగ్రాహ కుడిగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 14న(Salaar Movie Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.
ఇదీ చూడండి:క్యూట్‌గా రకుల్‌ప్రీత్ .. హాట్ ఫోటోషూట్‌తో దిశా పటానీ