హీరోయిన్ రష్మిక మందణ్న.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు'లో నటించే అవకాశం దక్కించుకొని అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య 'హీ ఈజ్ సో క్యూట్' అంటూ సాగే ఓ మెలోడీ గీతమూ ఉంది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. నేడు(ఆదివారం) ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లోని తన ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. వారడగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
ఇందులో భాగంగా ఓ నెటిజన్.. "మీకు మహేశ్‌కు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా?" అని రష్మికను అడిగాడు. సమాధానంగా.. "చిత్రంలో తనకూ, మహేశ్‌కు మధ్య క్యూట్ రిలేషన్షిప్ ఉంటుందని, మీరడగిన లాంటి సీన్స్ ఉండవంది. అయితే ఆన్ స్క్రీన్‌లో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది" అని రష్మిక చెప్పింది.