లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన కుమారుడు అర్హన్తో జాలీగా గడుపుతోంది. అయితే తాజాగా ముంబయిలో ఆమె ఉంటున్న నివాస ఆవరణలో ఒకరికి కరోనా సోకడం వల్ల ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఫలితంగా ఆమె ఉంటున్న నివాస భవనాన్ని క్వారంటైన్లో ఉంచారు.
క్వారంటైన్లో బాలీవుడ్ బ్యూటీ నివాస భవనం
బాలీవుడ్ నటి మలైక అరోరా ఉంటున్న నివాస భవనాన్ని క్వారంటైన్లో ఉంచారు. ఆ భవనం ఆవరణలో ఒకరికి కరోనా సోకడం వల్ల ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
మలైక అరోరా
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. లాక్డౌన్ ప్రారంభం నుంచి తన యోగా ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో మలైకా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.
ఇది చూడండి :నీళ్లెలా తాగాలో చెబుతోన్న బాలీవుడ్ ఫిట్టెస్ట్ మామ్