లాక్డౌన్లో విసుగు చెందుతున్న వారికి బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఓ గొప్ప అవకాశం ఇచ్చారు. 'ఇండియా లెట్స్ మేక్ ఏ ఫిల్మ్' పేరుతో నిమిషం నిడివి ఉండే మొబైల్ ఫిలిమ్స్ తీయాలని ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు బాలీవుడ్ ప్రముఖులు ఏక్తా కపూర్, ఆనంద్ ఎల్ రాయ్, సాజిద్ నాడియాద్వాలా, దినేష్ విజన్, నితీశ్ తివారీ, మహావీర్ జైన్ ముందుకొచ్చారు. వీరి ఈ ఆలోచనకు ముఖేశ్ ఛబ్రా, మోంటూ బస్సీ, మౌలిక్ భగత్ ప్రచారం చేస్తున్నారు.
నిమిషంలో ఈ అంశాలపై..
కేవలం నిమిషంలో సినిమా తీసి పంపేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు కొన్ని ముఖ్యమైన అంశాలపై మొబైల్లో సినిమా తీయాలని నిర్ణయించారు. అవి..
1. ది గుడ్ సైడ్ ఆఫ్ క్వారంటైన్
2. హమ్ హోంగే కామ్యాబ్