తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆయనతో పనిచేయడం నాకెప్పుడూ ఇష్టమే' - త్రివిక్రమ్

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు మరోసారి త్రివిక్రమ్​తో కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసిన ఉన్న ఫొటోను మహేశ్​ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

'ఆయనతో పనిచేయడం నాకెప్పుడూ ఇష్టమే'

By

Published : Apr 11, 2019, 1:56 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో ప్రిన్స్​ మహేశ్​బాబు మరోసారి పనిచేస్తున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదు ఓ ప్రకటన కోసం. మహేశ్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న ఓ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్‌కు సంబంధించిన షూటింగ్​ జరుగుతోంది. ఈ ప్రకటనను త్రివిక్రమ్‌ డైరక్ట్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫొటోను మహేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

‘నా ఫేవరేట్‌తో మరోసారి. ఆయనతో కలిసి పనిచేస్తే కలిగే అనుభూతి నాకెప్పుడూ నచ్చుతుంది’ అంటూ ప్రిన్స్​ మహేశ్​ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం మహేశ్‌.. ‘మహర్షి’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో త్రివిక్రమ్‌.. అల్లు అర్జున్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఏప్రిల్ 24 నుంచి రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో మహేశ్​, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details