తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మామాంగం.. మహా పురుషుడి అవతారం'

మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తోన్న మలయాళ చిత్రం 'మామాంగం' తెలుగు ట్రైలర్ విడుదలైంది. విజువల్స్​, పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

మామాంగం

By

Published : Nov 9, 2019, 3:12 PM IST

మమ్ముట్టి హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మలయాళ చిత్రం 'మామాంగం'. 1680 కాలానికి చెందిన ఓ మహావీరుడి కథాంశంతో దర్శకుడు పద్మ కుమార్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఉన్ని ముకుందన్‌, సిద్ధిక్‌, మణికుట్టన్‌, కనిక, అను మరిన్ని పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

విజువల్స్​తో పాటు పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. "మామాంగానికి వల్లువనాడు నుంచి ఇప్పటికీ ఒక్క వ్యక్తైనా వస్తున్నాడంటే. ఆ ప్రతీకార జ్వాలలు ఇంకా మన వల్లువనాడు స్త్రీల మనసులో రగులుతూనే ఉన్నాయి కాబట్టి.. అటువంటి వారి కడుపున నువ్వు, నేను జన్మించాం" అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. "విజయం కోసం తెగించి వెళ్లిన ఏ మగవాడిని తలచుకుని.. వల్లువనాడులో ఏ ఆడది ఒక్క బొట్టు కూడా కన్నీరు కార్చదు. అలా జరిగితే అది ప్రళయం అవుతుంది" అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

ఇవీ చూడండి.. నిర్మాతగా మారబోతున్న యంగ్ టైగర్..!

ABOUT THE AUTHOR

...view details