తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలు ఆరోగ్యంపై సోమవారానికి శుభవార్త!

కరోనాతో పోరాడుతోన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

బాలు ఆరోగ్యంపై సోమవారానికి శుభవార్త!
బాలు ఆరోగ్యంపై సోమవారానికి శుభవార్త!

By

Published : Sep 3, 2020, 6:13 PM IST

కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

"నాన్న ఆరోగ్యం వరుసగా నాలుగో రోజూ నిలకడగా ఉంది. వచ్చే సోమవారం నాటికి నాన్న ఆరోగ్యం విషయంలో శుభవార్త వెలువడుతుందని ఆశిస్తున్నా. ఆ రోజు కోసం నేనూ ఎదురు చూస్తున్నా" అని చరణ్‌ వీడియోలో చెప్పారు.

కాగా బాలు చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి కూడా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. "ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి వెంటిలేటర్‌, ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది" అని ఆస్పత్రి బులిటెన్‌లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details