తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2' టీజర్​తో రాకీభాయ్ సెంచరీ - kgf2 yash

అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్​ దక్కించుకున్న 'కేజీఎఫ్ 2' టీజర్​ యూట్యూబ్​ దుమ్ముదులిపేస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్​లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

KGF Chapter 2 Teaser Breaks YouTube World Record; Crosses 100 Million Views
'కేజీఎఫ్ 2' టీజర్​తో రాకీభాయ్ సెంచరీ

By

Published : Jan 9, 2021, 8:09 PM IST

'గ్యాంగ్‌లతో వచ్చేవాడు గ్యాంగ్‌స్టర్‌.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్‌స్టర్‌'.. 'కేజీఎఫ్‌'లో ఈ ఒక్క డైలాగ్‌ చాలు రాకీ పాత్రను ఏ స్థాయిలో హైలైట్‌ చేశారో అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే కరెక్ట్‌ అని మరోసారి రాకీభాయ్‌ నిరూపించాడు. యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్​లో రికార్డులు బద్దలు కొడుతోంది. గురువారం రాత్రి దానిని విడుదల చేయగా, అతి తక్కువ సమయంలో 100 మిలియన్‌ వ్యూస్‌ను దాటిన ఘనత సాధించింది. 5 మిలియన్లకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌లో టాప్‌లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, కథానాయకుడు యశ్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 'పవర్‌ఫుల్‌ పీపుల్‌ మేక్‌ ప్లేసెస్‌ పవర్‌ఫుల్‌: కథ ఇప్పుడే ప్రారంభమవుతోంది' అంటూ ట్వీట్‌ చేశారు.

తొలి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2' సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీరా ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details